Minister Ganta Srinivasa Rao Releases AP DSC 2018 Notification,Visakhapatnam,Vizagvision..విశాఖపట్నం
లో ఏపీ డీస్సి నోటిఫికేషన్
షెడ్యూల్ విడుదల చేసారు మంత్రి గంటా శ్రీనివాసరావు.
10560 పోస్ట ల భర్తీ కి షెడ్యూల్ విడుదల.
జూలై 6న డీఎస్సి నోటిఫికేషన్
ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. మే 4న టెట్, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసకమిషన్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు.
ఇక లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ విద్యపై ఆ ప్రభావం లేకుండా చూశాం.
విద్యా రంగానికి బడ్జెట్ లో అత్యధిక బడ్జెట్ కేటాయింపులు జరిగాయి
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ విడుదల చేశాం అంటున్నారు మంత్రి ఘంటా .