Ambedkar Birthday Celebrations,Paravada ,Visakhapatnam,Vizag Vision..పరవాడ మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 127 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. అలాగే లంకెలపాలెం లో గల గంగిరెడ్ల కాలనిలో అంబేద్కర్ పేరుతో కమిటీ హాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఎస్సి ఎస్టీ దళితుల అణగారిన వారి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు అని చెప్పారు.అంబేద్కర్ ఒక దళిత నాయకుడే కాదు స్వాతంత్ర్య సమరయోదుడని తెలిపారు.అంతేకాకుండా అమరావతి లో.136 అడుగులు అంబేద్కర్ సిద్దువనం అనే పేరుతో విగ్రహాం కడుతున్నామని తెలిపారు.