Vizag Vision:IT SEZ Hill No 2 launched CONDUENT software company by AP CM,Visakhapatnam..మధురవాడలోని ఐటి సెజ్ హిల్ 2 లో కాన్డ్యూయెంట్,ప్రొసీడ్,తురాయా సాఫ్ట్ టెక్కం పెనీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
విభజన సమయంలో 99 శాతం ఐటి రంగం హైదరాబాద్ లో ఉండి పోయింది
అప్పుడు కేవలం ఒక్క శాతం చిన్న కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి
ఇతర దక్షణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం తలసరి ఆదాయం తక్కువుగా ఉంది తలసరి ఆదాయం పెంచడంతో పాటు
ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒక్కటి గానూ,2029 దేశంలో నెంబర్ వన్ స్థానంలోనూ,
2050 కి ప్రపంచంతోనూ పోటీ పడాలి అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం
టెక్నాలజి సహాయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశం చేసారు
సెన్సార్ల సహాయంతో నీటి నాణ్యత పర్యవేక్షిస్తున్నాం
డ్రోన్ల సహాయంతో రోడ్ల నాణ్యత తెలుసుకుంటున్నాం
10 లక్షల ఐఓటి పరికరాలతో పెన్షన్లు,భూసార పరీక్షలు.ఇలా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నాం.
రానున్న రోజుల్లో 50 లక్షల ఐఓటి పరికరాలు వినియోగించబోతున్నాం
మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కుంటుంది ఐటీ శాఖ తీసుకోవద్దు అని అందరూ హెచ్చరించారు
మనకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఉన్నారు
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లి చంద్రబాబు గారి రాష్టం నుండి వచ్చాం అనగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు
ఐటి రంగంలో ఉన్న పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి
విశాఖపట్నం కి ప్రపంచంలోనే పెద్ద కంపెనీలు అయిన కాన్డ్యూయెంట్,ఫ్రాంక్లిన్ కంపెనీలు వచ్చాయి
కాన్డ్యూయెంట్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 92 వేల మంది పనిచేస్తున్నారు
మన దేశంలో కాన్డ్యూయెంట్ కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతుంది.అందులో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి అని కోరుతున్నాను
2019 కి లక్ష ఐటి ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం
16 వేల 500 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించాం
25 వేల ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు పూర్తి అయ్యాయి.త్వరలోనే కార్యకలాపాలు కూడా ప్రారంభం అవుతాయి
మరో 40 వేల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం
ఐటి రంగంలో టాప్ లిస్ట్ లో ఉన్న నగరాలతో పోటీ పడే సత్తా విశాఖపట్నం కు ఉంది
దేశంలో విశాఖపట్నం అంత అందమైన నగరం,మంచి ప్రజలు ఎక్కడా ఉండరు
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిలో పది శాతం తెలుగు వారే
రాష్ట్రంలో అద్భుతమైన యువతి,యువకులు ఉన్నారు
యువతి,యువకులకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం