Vizag Vision:Maoos also opened fire on police firing Maoists killed in fire & police seized large explosives Koraput District ,Odisha State…ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లా ఏవోబీ సరిహద్దు ప్రాంతం మరో మారు తుపాకీ తూటాలతో ఉలిక్కిపడింది. మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల శబ్ధాలతో వణుకుపోయింది. నారాయణపట్నం బ్లాక్ డోక్రీఘాట్ వద్ద మావోయిస్టులు సంచరిస్తున్నారన్న ఒడిస్సాకు చెందిన డిస్ట్రిక్ట్ వాలంటీర్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సిబ్బంది కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల సంచారం కనిపెట్టిన ఎవ్వోజీ, డీవీఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు ప్రతిగా మావోలు సైతం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగరు మావోయిస్టులు చనిపోగా భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో మరనించిన మావోయిస్టులు నలుగురు మహిళలేనని కోరాపుట్ ఎస్పీ స్పస్టం చేశారు. ఘటనా స్థలం నుంచి 4 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్ ఒకటి, టిఫిన్ బాంబ్ 1డిటోనేటర్స్ 4, 303 రిఫీల్స్ 1, క్యాష్ 10వేలు ఇతర పేలుడు పదార్థాలు వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక మృతుల్లో సుక్మా జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు ఉంగి ఆలయాస్ హారతిగా గుర్తించారు. గతంలో ఈమెపై 4లక్షల రివార్డు సైతం ఉంది. మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారన్న సమాచారంతో ఎస్వోజీ, డీవీఎఫ్ పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. ఏవోబీ సరిహద్దును జల్లెడపడుతున్నారు…