Vizag Vision:seeking special status Kagadala Prasasana Krishna district,.
ప్రత్యేక హోదా కోరుతూ కృష్ణా జిల్లా మచిలీపట్నం లో కాగాడల ప్రదర్శన.
భారీగా వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు ,ప్రజా సంఘాలు, ప్రజలు.
ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో మచిలీపట్నం లో కదం తోక్కిన ముఖ్య నాయకులు..
ప్రత్యేక హోదా అంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కోనేరు సెంటర్ కి చేరింది..
అంధ్రప్రదేశ్ విభజన చట్టం లో ఉన్న హమీలు అమలులో కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని ప్రజా ఉద్యమం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకుందాం.
అంధ్రప్రదేశ్ అభివృద్ధి కి ప్రత్యేక హోదా తోనే సాధ్యమని అది సాదించేవరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు..
ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు లో మన పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెడితే వాటిని చర్చకు రాకుండా ఇతర రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు తో గోడవ చేపిస్తున్నారని..దుయ్యబట్టారు.
అంధ్రప్రదేశ్ లో ఐదు కోట్లు మందు ప్రజల ఆకాంక్ష వారి భవిష్యత్తుని దృష్టి లో ఉంచుకుని ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా సాధించే దిశగా ప్రయత్నాలు చేయ్యలని కోరారు.
ప్రత్యేక హోదా సాధన మోస పూరితంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలు కి ఆంద్ర ద్రోహులు గా ప్రజలు ముద్ర వేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ప్రత్యేక హోదా సాధన సమీతి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు, సి పి యం ,నాయకులు మదు,సిపిఐ నాయకులు రామకృష్ణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెర్ని నాని ,కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.