Vizag Vision:AP CM PressMeet,,Amaravathi…ఏపీకి సహాయం చేసే ఉద్దేశం ఎక్కడా అరుణ్ జైట్లీ మాటల్లో కనిపించలేదు
కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలనే అభిప్రాయానికి వచ్చాం… టీడీపీకి ఎప్పుడూ పదవులు ముఖ్యంకాదు-
మా పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులను రాజీనామా చేయాలని ఆదేశించాం… రేపు రాజీనామా చేస్తారు-
కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించడమే ఫస్ట్ స్టెప్… తర్వాత మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటాం-
రాజీనామా విషయాన్ని ప్రధానికి చెప్పేందుకు ప్రయత్నించాం… కానీ, ప్రధాని అందుబాటులోకి రాలేదు-
మేం ఎక్కడా గొంతెమ్మ కోర్కెలు కోరలేదు-
దేశ రక్షణ నిధులు కూడా ఇమ్మంటున్నారన్న అర్థంలో అరుణ్ జైట్లీ మాట్లాడారు-
మొదట కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాం… తర్వాత ఏంటనేది మళ్లీ చెబుతాం-
మేం అన్ని ప్రయత్నాలు చేశాం… 29 సార్లు ఢిల్లీ వెళ్లాం… మూడు సార్లు గట్టిగా నిలదీశాం… అయినా న్యాయం చేయలే
మేం కేబినెట్లో చేరిన ఉద్దేశం నెరవేరనప్పుడు… అందులో ఉండడం సరికాదని బయటకు వస్తున్నాం-
ఇప్పుడు ఫ్రంట్స్ గురించి మాట్లాడే సమయం కాదు-
రాజీనామా నిర్ణయంతో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూస్తాం… ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అది చేస్తారు-ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర వైఖరిలో మార్పులు రాలేదు… కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం- సీఎం చంద్రబాబు నాయుడు