VIZAG VISION:VIZAG VISION Janmabhoomi Program By Hon’ble AP CM at Nellore…. ఏపీలోనే విక్రమ సింహపురి వర్సిటీని బెస్ట్ వర్సిటీగా తీర్చిదిద్దుతాం
50 కోట్ల నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమే, ఎక్స్ పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి వర్సిటీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా, విద్యావ్యవస్థను మెరుగు పరిచేలా పనిచేస్తున్నాం, ప్రతి విద్యార్థి ఒక పరిశోధకుడు కావాలి, అందుకే విద్యార్థులను క్షేత్ర స్థాయి లో పరిశోధనలకు అవకాశం ఇస్తున్నాం,మొదటి సారిగా ఇనఫర్మేషన్ టెక్నాలజీకి, కళాశాలలకు ప్రాధాన్యం ఇచ్చాము, ఏపీ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడానికి కృషి చేస్తున్నాం,ఏడో తరగతి నుంచే విద్యార్థులు వినూత్న ఆలోచన చేసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో అవగాహన పెంచుకోండి,నిద్ర సమయం తప్ప, మిగతా సమయమంతా పని చేస్తూనే ఉంటా, నాకు విసుగు రాదు, కళాశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్ లు, వై ఫై ఏర్పాటు చేస్తున్నాం, ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నాం,రాష్ట్రంలో విస్తృతంగా పరిశ్రమలు వస్తున్నాయ్, యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి,2019లోపు ఏపీని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
జన్మభూమి ద్వారా అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాం