VIZAGVISION:India & Sri Lanka teams reached Visakhapatnam…మూడో వన్డేల సిరీస్ లో భాగంగా మూడో వన్డే ఆడేందుకు భారత్ శ్రీలంక జట్లు విశాఖకు చేరుకున్నాయి. సిరీస్ లో చేరో మ్యాచ్ లో నెగ్గడంతో మూడో వన్డే అత్యంత కీలకంగా మారింది. సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మకమైన మ్యాచ్ కావడంతో అందరి దృష్టి ఇప్పుడు విశాఖవైపునకు మరలింది. విశాఖ స్టేడియం సెంటిమెంట్ గా భారత్ కు కలిసి వస్తుంది కావున విజయం భారత్ దేనని క్రికెట్ అభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలో 27 వేల సీటింగ్ కెపాసిటి ఉంది. మొత్తం 30 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే మూడో వన్డే కోసం టిక్కెట్ విక్రయాలను బీసీసీ ఐ ప్రారంభించింది. ప్రారంభించిన గంటల వ్యవధిలోనే టిక్కెట్లు అన్ని అమ్ముడయ్యాయి. రెండో వన్డేలో రోహిత్ శర్మ విఝృంభించడంతో మూడో వన్డేకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. మరోవైపు రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ లో పాల్గొననున్నాయి.