బీచ్ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమాలు
సమాజ సేవయే పరమావధిగా భావించే బీచ్ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నేడు విశాఖ నగరంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. ఆదివారం డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ గౌరనీయులైన శ్రీ ఆర్.ఆర్.ఎస్. మహేష్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
ప్రేమ సమాజానికి మందుల పంపిణీ:
తొలుత అసోసియేషన్ సభ్యులు డాబాగార్డెన్స్‌లోని ప్రేమ సమాజాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న రోగులకు, వృద్ధులకు అవసరమైన మందులను అసోసియేషన్ కార్యదర్శి శ్రీ దండు నాగేశ్వరావు గారు తేవగా, వాటిని డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ శ్రీ ఆర్.ఆర్.ఎస్. మహేష్ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బొట్టా వేణుగోపాలరావు గారు మరియు శ్రీ లక్ష్మోజీ గారు మాట్లాడుతూ, వృద్ధులకు పేదలకు అండగా నిలవడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
నిరాశ్రయులకు వస్త్రదానం:
అనంతరం, GVMC సౌజన్యంతో TSR కాంప్లెక్స్ వద్ద నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహాన్ని మధ్యాహ్నం సభ్యులు సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న పేదలకు అసోసియేషన్ సభ్యులు శ్రీ కె. సింహాచలం గారు మరియు శ్రీ జె. రామకృష్ణ గారు వస్త్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీ ఎస్.పి.వై. నాయుడు గారు మరియు శ్రీ పి. గోవింద గారు మాట్లాడుతూ, వచ్చే మార్చి నెలలో నిరాశ్రయుల వసతి గృహంలోని వారికి అసోసియేషన్ తరపున ఒక పూట అన్నదానం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శ్రీ వి. సత్తిరాజు గారు మరియు శ్రీ సి.హెచ్. సత్యనారాయణ మూర్తి గారు రాబోయే సేవా కార్యక్రమాల గురించి వివరిస్తూ, డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ గారి ప్రోత్సాహంతో ప్రతినెలా ఇలాంటి అర్థవంతమైన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.













