సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డ్

🚢విశాఖపట్నం పోర్ట్ చైర్ పర్సన్ డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్ సమర్ధవంతమైన నాయకత్వంలో సరుకు రవాణాలో పోర్ట్ సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో…కేవలం 327 రోజుల్లోనే 80.00 మిలియన్ మెట్రిక్ టన్నుల (80,082,108 ఎంఎంటీ) సరుకు రవాణాను నిర్వహించి (ఫిబ్రవరి 21 వరకూ) చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది.
పోర్ట్ 92 ఏళ్ల చరిత్రలో ఇది అతి తక్కువ సమయంలో 80 ఎంఎంటీ సరుకు రవాణా నిర్వహణగా రికార్డ్ సృష్టించింది.
పోర్ట్ చైర్ పర్సన్ డా. ఎం. అంగముత్తు.. 90 ఎంఎంటీ లక్ష్య సాధన దిశగా పోర్ట్ అధికారులను నిరంతరం ప్రోత్సహిస్తూ, వ్యూహాత్మక దృష్టితో ముందుకు నడిపిస్తున్నారు. ఈ కోవలోనే తక్కువ సమయంలో 80ఎంఎంటీ రికార్డ్ ను పోర్ట్ నెలకొల్పింది ఇదే ఉత్సాహంతో ముందుకు వెళితే….ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 90 ఎంఎంటీ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంటామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గతంలో
- 2024–25 ఆర్థిక సంవత్సరంలో 23 మార్చి 2025 న 357 రోజుల్లో 80.11 ఎంఎంటీ
- 2023–24 ఆర్థిక సంవత్సరంలో 27 మార్చి 2024 న 362 రోజుల్లో 80.02 ఎంఎంటీ
సాధించింది.
ఈ విజయం పోర్ట్ యొక్క… కార్యాచరణ నైపుణ్యం, సమర్థవంతమైన నిర్వహణ, భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయం, మరియు సరుకు రవాణా వృద్ధిలో స్థిరమైన పురోగతి స్పష్టంగా ప్రతిఫలించాయి.
ఈ రికార్డు సాధనలో భాగస్వాములైన అన్ని విభాగాల అధికారులను, సిబ్బందిని మరియు స్టేక్హోల్డర్లను చైర్పర్సన్ డా. ఎం. అంగముత్తు ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 90 ఎంఎంటీ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.











