విశాఖపట్నం పోర్ట్ లో ఉత్సాహంగా ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్
విశాఖపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో “ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్”కార్యక్రమం లో భాగంగా “సండే ఆన్ సైకిల్స్” ను పోర్ట్ స్టేడియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యం, ఫిట్నెస్ మరియు సక్రియ జీవనశైలిని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది.
“ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్” డిసెంబర్ 2024లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతి వారం సైక్లింగ్ కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరతపై అవగాహన కల్పించే సామూహిక ఉద్యమంగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో వీపీఏ ఉద్యోగులు, CISF సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ మరియు ఆరోగ్యవంతమైన భారత నిర్మాణం పట్ల వారి అంకితభావాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింద













