తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఢిల్లీలోని నివాసంలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ..
రేవంత్‌కు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రేవంత్‌తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్ కండువాలు కప్పారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్ సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
రేవంత్ రెడ్డితో పాటు సీతక్క, వేంనరేందర్ రెడ్డి(వరంగల్), సిహెచ్. విజయ రమణరావు(పెద్దపల్లి), అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు(బోథ్), పటేల్ రమేష్ రెడ్డి, దొమ్మటి సాంబయ్య, తోటకూర జానయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హరిప్రియ నాయక్, బల్య నాయక్, రాజారాం యాదవ్, ముగ్గురు ఓయూ జాక్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.