తల్లిదండ్రులే పిల్లలకు తొలి గురువులు…ఘనంగా లక్కీ యాపిల్ ప్లే స్కూల్ వార్షికోత్సవం…బుడిబుడి అడుగుల చిన్నారుల స్నాత కోత్సవ సందడి..తల్లిదండ్రులే తమ పిల్లలకు తొలుగురువులని, ఆ తర్వాత స్థానము గురువులదేనిని జీవీఎంసీ 95 వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు అన్నారు. శనివారం ఇక్కడ సుజాతనగర్. ఆర్కే ఫంక్షన్ హాల్ లో లక్కీ యాపిల్ ప్లే స్కూల్ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ ముమ్మన దేవుడు మాట్లాడుతూ పిల్లలు దేవుళ్ళతో సమానమన్నారు. వారికి చిన్ననాటి నుంచే ఆటలు, క్రమశిక్షణ, అంకితభావం దేశభక్తితో ముందుకు సాగే విధంగా తల్లిదండ్రులు అధ్యాపకులు ఉన్నతముగా తీర్చిదిద్దాలన్నారు. చిన్నపిల్లల మనసుకు కష్టం లేకుండా వారికి నచ్చిన రీతిలోనే విద్యా బోధన చేయాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథిగా హాజరైన సింహాచలం దేవస్థానం ధర్మ కర్త ల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తల్లి కడుపులో ఉన్నప్పుడే పిల్లలకు అన్ని విషయాలు అర్థమవుతాయన్నారు. కాబట్టి పిల్లల అభిరుచి కి తగ్గట్లుగా ఆటపాటలు, విద్యాబోధన ఉండాలన్నారు. నేటి చిన్నారులు రేపటి భావి భారత పౌరులన్నారు..ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను, చిన్నారులను ఎంతగానో అలరించాయి. అలాగే పిల్లలంతా స్నాత కోత్సవము తో సందడి చేసారు..పిల్లలు కు అతిధి లు చేతులు మీదుగా బహోమతి లు ప్రధానము చేసారు. పాఠశాల ప్రిన్సిపాల్ కసిరెడ్డి పావని, చైర్మన్ దొంతల సంతోష్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జెట్లీ ఇతర అధ్యాపకులు, తల్లి తండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


















