VIZAGVISION:”Life Again Foundation’s” Winners Walk on Cancer Awareness RK Beach,Actors Balakrishna & Gautami Participates,Visakhapatnam…అవగాహనతో క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.
‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ రామకృష్ణ బీచ్లో క్యాన్సర్ అవగాహన నడక జరిగింది.
శనివారం ఉదయం కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు నడక నిర్వహించారు.
సినీనటి గౌతమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పేదలకు క్యాన్సర్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని తన తండ్రి ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు.
40 పడకలతో మొదలైన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 512 పడకలు ఉన్నాయన్నారు.
ఆస్పత్రి ద్వారా అందిస్తున్న సేవలను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధినిజయించిన పలువురికి అభినందన పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో ఏయూవీసీ ఆచార్య నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.