క్యాన్సర్‌పై ‘యూనిఫై టు నోటిఫై’ జాతీయ క్యాంపెయిన్ ప్రారంభం

- క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ క్యాంపెయిన్
- ఆపోలో క్యాన్సర్ సెంటర్, ఐసీఎంఆర్, ఐఎంఏ, రాష్ట్ర ఆంకాలజీ సంఘాల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యతిరేక పోరాటం
విశాఖపట్నం, ఫిబ్రవరి 2025: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), రాష్ట్ర ఆంకాలజీ సంఘాలు సంయుక్తంగా అపోలో క్యాన్సర్ సెంటర్ (ఆరిలోవ)లో ‘యూనిఫై టు నోటిఫై’ అనే జాతీయ క్యాంపెయిన్ ను ముఖ్య అతిథి, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ ఐ వాణి, గౌరవ అతిథి, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీ మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ సెంటర్స్ (విశాఖపట్నం) సీనియర్ మెడికల్, హేమేటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వేంట్రపాటి ప్రదీప్, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్, చీఫ్ రోబోటిక్ & సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంపీఎస్ చంద్ర కళ్యాణ్, డాక్టర్ జయశ్రీ, రేడియేషన్ ఆంకాలజిస్ట్, అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం; డాక్టర్ ఆదిత్య నారాయణ్, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం; డాక్టర్ బ్రహ్మాజీ నాయుడు, యూనిట్ హెడ్, అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం; తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ ఈ క్యాంపెయిన్ భారత ప్రభుత్వం క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా గుర్తించాలనే విజ్ఞప్తితో ముందుకు వెళ్తుందన్నారు. ఇది క్యాన్సర్ వ్యతిరేక పోరాటంలో కీలకమైన అడుగుగా చెప్పవచ్చన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. 2025 నాటికి ఈ సంఖ్య 15.7 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీ మోహన్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా గుర్తించడం వల్ల.. రియల్ టైమ్ డేటా సేకరణ, కచ్చితమైన నివేదికలు సాధ్యమవుతాయన్నారు. తద్వారా వ్యాధి స్థాయిని సరిగ్గా అంచనా వేయవచ్చన్నారు. ఎపిడెమియోలాజికల్ విశ్లేషణ, లక్ష్యప్రాయమైన చికిత్సా విధానాల ద్వారా ప్రామాణిక చికిత్సా ప్రోటోకాల్ రూపొందించవచ్చని చెప్పారు. చికిత్సలో కచ్చితత్వం, సమర్థత పెరిగి భారతదేశం గ్లోబల్ ఆంకాలజీ పరిశోధనలో అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందన్నారు. 2022లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాజ్యసభకు క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా చేయాలని సిఫార్సు చేసిందన్నారు. ఈ ఉద్యమం ద్వారా పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ ప్రతిపాదన వచ్చే బడ్జెట్ సమావేశంలో పార్లమెంటులో ఆమోదం పొందాలని ఆశిస్తున్నారన్నారు.
అపోలో క్యాన్సర్ సెంటర్ గురించి
క్యాన్సర్ కేర్ లెగసీ: 30 ఏళ్లుగా జీవితాలకు ఆశను అందిస్తున్న సేవలు.. క్యాన్సర్ చికిత్స అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు, 360 డిగ్రీల సమగ్ర సేవలు అందించాల్సిన అవసరం ఉంది. దీని కోసం నిబద్ధత, నైపుణ్యం, మహత్తరమైన సేవా భావం అవసరం. అపోలో క్యాన్సర్ సెంటర్ భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌తో 390 మంది ఆంకాలజిస్టుల సహాయంతో అధునాతన, కచ్చితమైన ఆంకాలజీ థెరపీని అందిస్తుంది. ప్రామాణికమైన క్యాన్సర్ చికిత్సను ఆర్గన్-బేస్డ్ ప్రాక్టీస్ ద్వారా నిపుణులైన క్యాన్సర్ మేనేజ్మెంట్ టీమ్‌లతో అందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ ఫలితాలను అందించడమే లక్ష్యం. ప్రస్తుతం 147 దేశాల నుంచి రోగులు భారతదేశంలోని అపోలో క్యాన్సర్ సెంటర్లకు చికిత్స కోసం వస్తున్నారు. దక్షిణాసియా, మధ్య ప్రాచ్యంలో మొట్టమొదటి పెన్సిల్ బీమ్ ప్రోటాన్ థెరపీ సెంటర్ అపోలో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులో ఉంది. దేశీయ, అంతర్జాతీయ రోగులు 24/7 అందుబాటులో ఉన్న ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ (040-48964515) ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ప్రత్యేక బ్రెస్ట్ క్యాన్సర్ క్లినిక్ ప్రారంభం: అనుమానం వచ్చిన నిమిషాల నుంచి 24 గంటల్లో నిర్ధారణ.. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, నిర్ధారణ, చికిత్స కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్లినిక్ ఇది. వేగంగా, కచ్చితమైన సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది.
మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి: 9963980259/ 9985310069