HomeUncategorizedVizag vision : ఉన్నత విద్యతో యువతకు అపార ఉపాధి అవకాశాలు…స్వశక్తితో ముందుకు సాగితే అన్ని విజయాలే ఎయిమ్ సాఫ్ట్ వేర్ ప్రారంభించిన ఎమ్మెల్యేవంశీకృష్ణ శ్రీనివాస్, శివ శంకర్*అక్కయ్యపాలెం…ఉన్నత విద్యతో యువతకు అపార మైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఐతే ప్రతీ ఒక్కరు సొంతంగా ఎదిగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్ష వ్యక్తము చేసారు.. ఇక్కడ విశాఖ రైల్వే స్టేషన్ కు కూత వేటు దూరంలో దొండపర్తి జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిమ్ సాప్ట్ వేర్ టెక్నాలజీ సంస్థను ఆదివారం ఏపీ ఎం ఎస్ ఎం ఈ చైర్మన్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ తో కలిసి వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ సంస్థ గాజువాకలో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ సుమారు 500 మంది వరకు అనేక కోర్స్ లలో శిక్షణ పొంది అనేక మంది ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు. తాజాగా రైల్వే స్టేషన్…ఆర్టిసి కాంప్లెక్స్ మధ్య దొండ పర్తి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ నూతన సంస్థ వల్ల ఉత్తరాంధ్రకు చెందిన అనేకమంది యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు వారు కోరుకున్న మిగతా కోర్సుల్లో కూడా శిక్షణ పొందవచ్చునన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్రము లో కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తుంది అన్నారు. సింగిల్ విండో అనుమతులు ఇచ్చి ఆ పైన రాయితీలు ఇచ్చి కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఉన్నత విద్యతోనే అపారమైన ఉపాధి అవకాశాలని,కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంతవరకు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు అవసరమైన శిక్షణ పొందాల్సిందేనన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ యువత కు చదువుకోవాలనే తపన ఉంటే అందుకు విశాఖలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అలాగే యువత కూడా సొంతం గా ఆర్థికంగా ఎదిగేందుకు. ప్రయత్నం చేయాలని, అప్పుడే వారు కన్న కలలు సాకారం అవుతాయన్నారు. సంస్థ ఎండి ఎస్.శేషగిరి డైరెక్టర్ మహాలక్ష్మిలు మాట్లాడుతూ తమ సంస్థ ల్లో నిపుణులుతో ఆయా కోర్స్ లకు సంబందించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నారు.. ఎఐ తో పాటు వివిధ కోర్స్ లలో శిక్షణ పొందవచ్చునన్నారు.. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ కార్పొరేటర్ బీశెట్టి వసంత కళ్యాణి, సీనియర్ నేత నారా నాగేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు చంటి,నరేంద్ర,పీలా రామకృష్ణ,నవీన్ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు..
Vizag vision : ఉన్నత విద్యతో యువతకు అపార ఉపాధి అవకాశాలు…స్వశక్తితో ముందుకు సాగితే అన్ని విజయాలే ఎయిమ్ సాఫ్ట్ వేర్ ప్రారంభించిన ఎమ్మెల్యేవంశీకృష్ణ శ్రీనివాస్, శివ శంకర్*అక్కయ్యపాలెం…ఉన్నత విద్యతో యువతకు అపార మైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఐతే ప్రతీ ఒక్కరు సొంతంగా ఎదిగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్ష వ్యక్తము చేసారు.. ఇక్కడ విశాఖ రైల్వే స్టేషన్ కు కూత వేటు దూరంలో దొండపర్తి జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిమ్ సాప్ట్ వేర్ టెక్నాలజీ సంస్థను ఆదివారం ఏపీ ఎం ఎస్ ఎం ఈ చైర్మన్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ తో కలిసి వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ సంస్థ గాజువాకలో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ సుమారు 500 మంది వరకు అనేక కోర్స్ లలో శిక్షణ పొంది అనేక మంది ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు. తాజాగా రైల్వే స్టేషన్…ఆర్టిసి కాంప్లెక్స్ మధ్య దొండ పర్తి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ నూతన సంస్థ వల్ల ఉత్తరాంధ్రకు చెందిన అనేకమంది యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు వారు కోరుకున్న మిగతా కోర్సుల్లో కూడా శిక్షణ పొందవచ్చునన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్రము లో కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తుంది అన్నారు. సింగిల్ విండో అనుమతులు ఇచ్చి ఆ పైన రాయితీలు ఇచ్చి కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఉన్నత విద్యతోనే అపారమైన ఉపాధి అవకాశాలని,కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంతవరకు వారు కోరుకున్న రంగాల్లో ఎదిగేందుకు అవసరమైన శిక్షణ పొందాల్సిందేనన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ యువత కు చదువుకోవాలనే తపన ఉంటే అందుకు విశాఖలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అలాగే యువత కూడా సొంతం గా ఆర్థికంగా ఎదిగేందుకు. ప్రయత్నం చేయాలని, అప్పుడే వారు కన్న కలలు సాకారం అవుతాయన్నారు. సంస్థ ఎండి ఎస్.శేషగిరి డైరెక్టర్ మహాలక్ష్మిలు మాట్లాడుతూ తమ సంస్థ ల్లో నిపుణులుతో ఆయా కోర్స్ లకు సంబందించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నారు.. ఎఐ తో పాటు వివిధ కోర్స్ లలో శిక్షణ పొందవచ్చునన్నారు.. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ కార్పొరేటర్ బీశెట్టి వసంత కళ్యాణి, సీనియర్ నేత నారా నాగేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు చంటి,నరేంద్ర,పీలా రామకృష్ణ,నవీన్ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు..