VIZAGVISION:Go-Puja & Govardhan Puja by Hare Krishna Movement,Visakhapatnam..విశాఖలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామివారి గోశాల ప్రాంగణంలో హరేరామ మూమెంట్స్ వారి ఆధ్వర్యంలో ధామోధర కార్తీకమాసం పూజులో భాగంగా గిరివర్ధనగిరి పూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినరోజున గోవర్ధనపూజ నిర్వహించడం అనవాయితి ఈ నెపధ్యంలో ముందుగా బలరామకృష్ణులకు విశేషపూజులు నిర్వహించిన అనంతరం నెతిధీపాలతో హరతులు సమర్పించి సకల దేవతనిలయమైన గోవుకు గోపూజను నిర్వహించారు.అనంతరం పిండిపదార్ధలతో తయారుచేసిన గోవర్ధనగిరికి ప్రత్యేకపూజులు నిర్వహించి అపై గోవర్ధనగిరి నమూనకు భక్తులు స్వయంగా తయారుచేసిన పిండివంటలను నైవెధ్యంగా సమర్పించారు.కార్యక్రమంలో తూర్పూనియోజకవర్గం శాసనసభ్యులు వెలపూడి.రామకృష్ణబాబు సింహచలందేవస్ధానం కార్యనిర్వహణదికారి శ్రీ కె.రమచంద్రమోహన్ మరియు భక్తులు విశేషంగా పాల్గున్నారు