దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జమ్మూ కశ్మీర్లోని గురెజ్ లోయ ప్రాంతానికి వెళ్లారు. నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో భారత భద్రతా దళాలతో కలిసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. 2014లో కశ్మీర్ లోయను వరదలు ముంచెత్తినప్పుడు ప్రధాని మోదీ అక్కడి ప్రజలను సందర్శించి దీపావళి వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఆయన కశ్మీర్ లోయను సందర్శించడం ఇది రెండోసారి.