VIZAGVISION:Gedula Raju Murder Case Traced Vizag Police,Visakhapatnam.రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసులో పోలీసులు ఐదుగురుని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు రవిబాబు, భూపతిరాజు శ్రీనివాసరాజు పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా విశాఖ జాయింట్ పోలీస్ కమీషనర్ నాగేంద్రకుమార్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల 6న క్షత్రియభేరి పత్రిక కార్యాలయంలో గేదెల రాజు హత్యకు గురైయ్యాడు. గతంలో విశాఖ ఏస్పీగా ప్రధాన నిందితుడు రవిబాబు పని చేశాడు. ప్రస్తుతం ఆర్టీసీలో విజిలెన్స్ డీఎస్పీగా రవిబాబు పనిచేస్తున్నారు. క్షత్రియభేరి పత్రిక ఎడిటర్ భూపతిరాజుతో కలిసి రవిబాబు హత్యకు ప్లాన్ చేశాడు. రవిబాబును గేదెలరాజు రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. పోలీస్ అధికారే అరాచకానికి పాల్పడటం బాధాకరం’ అని విశాఖ జాయింట్ పోలీస్ కమీషనర్ నాగేంద్రకుమార్ తెలిపారు.