ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దివ్యాంగులు.

దివ్యాంగులకు ఇస్తున్న 3వేల రూపాయలు పెన్షన్ 10వేలు కు పెంచాలని దివ్యాంగుల సేవా సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దివ్యాంగుల హక్కుల సేవా సమితి అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షులు ఒమ్మి రామరాజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. దివ్యాంగులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో అవకాశాలు కల్పించాలని, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, డిమాండ్ చేశారు. అంత్యోదయ కార్డును ప్రతి దివ్యాంగునికి అందజేయాలని, మూడు చక్రాల మోటార్ వాహనాన్ని వయోపరిమితి లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలని బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలని, దివ్యాంగులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని ఉచిత విద్యుత్ 300 యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని తదితరు డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వేటూరి శ్రీనివాస్, గంగరాజు, మెహన్, నర్శింగరావు, తిరుపతి, విజయ్, అమ్ములు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.