ఈరోజు గాజువాక కణితి కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెత్త నిర్వహణ మరియు విభజన, యెల్పీజీ మరియు ఇతర ఇంధనాల పరిరక్షణ సాంకేతికతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎ.సుందర వదన్ రీజినల్ మేనేజర్ ఎల్పీజీ,విద్యార్థులతో ముచ్చటించి విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. పాఠశాల సిబ్బంది కూడా ఇదే అంశంపై వ్యాసరచన నిర్వహించి విద్యార్థులకు అక్కడికక్కడే బహుమతులు అందజేశారు.
హెచ్పీసీల్ నిర్వహణ సమన్వయంతో శ్రీ విజయ దుర్గా గ్యాస్ ఏజెన్సీ తడి మరియు పొడి చెత్తను వేరు చేయడానికి 50 కౌంట్ డస్ట్బిన్లను పంపిణీ చేసింది. పాఠశాలలో కూడా పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించి, హెచ్పిసిఎల్ యాజమాన్యం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ.సుందర వదన్ రీజినల్ మేనేజర్ యెల్పీజీ, గౌరవ అతిథిగా టి.షర్మిల మార్కెటింగ్ మేనేజర్, శ్రీ విజయ దుర్గా గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం మరియు పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
















