కమల్ కొత్త పార్టీకి మహూర్తం ఖరారు..తమిళనాట రాజకీయాలలో పెనుమార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకూ రెండే రెండు పార్టీలు రాజ్యమేలాయి. త్వరలో కొత్త పార్టీని విలక్షణ నటుడు కమల్ హాసన్ పెట్టబోతున్న సంగతి గతంలో జరిగిన బహిరంగసభలో స్పష్టం చేశారు. నవంబరు 7న కొత్త పార్టీ పెట్టనున్నట్లు ,అదే రోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆ రోజే ముహూర్తం ఖరారు చేశారు. ఐతే పార్టీ గుర్తుపై ఆయన ఎలాంటి స్పష్టత నివ్వలేదు. కమల్ ఒంటరిగా బరిలోకి దిగుతారో, లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అనేది వేచిచూడాలి.
ప్రజా ప్రయోజనాలే తన అంతిమ లక్ష్యమని, రాజకీయాల్లో అంటరానితనానికి తావులేదని వ్యాఖ్యానించారు.