దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) కొత్త చైర్మన్గా రజనీష్ కుమార్ పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా ఉన్న అరుంధతి భట్టాచార్య పదవీ కాలం ఈ శుక్రవారంతో ముగియనుంది.
దీంతో సీబీఐ కొత్త చైర్మన్గా రజనీష్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈనెల 7 నుంచి రజనీష్ మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
రజనీష్ కుమార్ ప్రస్తుతం ఎస్బీఐ డైరెక్టర్గా పనిచేస్తున్నాయి.
37 ఏళ్లుగా ఎస్బీఐకి ఆయన సేవలందిస్తున్నారు.
అంతకుముందు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా, ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్ సీఈఓగా కూడా పిచేశారు.
1980లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఆయన ఎస్బీఐలో అడుగుపెట్టారు.