రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పు చేస్తోంది
— తెచ్చిన ప్రతి రూపాయి సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాo
— గత ప్రభుత్వంలో మాదిరి దుబారా చేయడం లేదు
— చిన్నమ్మ ఈ విషయం తెలుసుకుంటే మంచిది
— పురందేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ స్పందన
విశాఖపట్నం, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పు చేస్తోందని, తెచ్చిన ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై దర్యాప్తు జరిపిస్తామని, ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై, స్థానిక జీవీఎంసీ ఆవరణలో మీడియా ప్రతినిధులు బుధవారం అమర్నాధుని ప్రశ్నించగా, ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజా ఒకపక్క ప్రజా సంక్షేమాన్ని, మరోపక్క రాష్ట్ర అభివృద్ధినిదృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుందని, దీనికి అవసరమైన మొత్తాన్ని నిబంధనలను మేరకు వివిధ రూపాల్లో సేకరిస్తుందని చెప్పారు. తాము ఎవరికీ చెప్పకుండా, చేసింది అప్పుకు లెక్క లేకుండా తెచ్చిన మొత్తాన్ని దుబారా చేయడం లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పుకు లెక్క జమా లేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిజెపి కూడా బాగాఆయనతో కలిసి ఉందని, అప్పుడు బిజెపిలో ఉన్న చిన్నమ్మ, బాబు చేసిన అప్పుల గురించి ఎందుకు అడగలేదని అమర్నాథ్ అమర్నాథ్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పైసాకి లెక్క చెబుతోందని అమర్నాథ్ అంటూ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదో మాట్లాడాలి కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చిన్నమ్మ నిజాలు తెలుసుకుంటే మంచిదని అమర్నాథ్ హితవు పలికారు.