VIZAGVISION:8Kgs Gold & 4Crores Currency Maha lakshmi Devi Alankaram Kanyaka Parameswari,Visakhapatnam…విశాఖలోని పాతనగరంలో కురుపాం మార్కెట్లో ఉన్న శ్రీకన్యకాపరమేశ్వరి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఎనిమిదో రోజైన గురువారం కన్యకాపరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఎనిమిది కేజీల బంగారు ఆభరణాలతో అలంకరించారు. నాలుగు కోట్ల కరెన్సీనోట్లతో అమ్మవారి గర్భగుడి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఒకవైపు స్వర్ణాభరణాలతో, మరోవైపు కరెన్సీ నోట్లతో దర్శనమిస్తున్న అమ్మవారిని చూసిన భక్తులు, భక్తి పారవశ్యంలో మునిగిపోయారు