సంఘటనలు
- 1745: బ్రిటన్ జాతీయ గీతం ‘గాడ్ సేవ్ ది కింగ్’ మొదటిసారిగా పాడిన రోజు.
- 1908: మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
- 2008: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
- 2013: పాలమూరు (మహబూబ్నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ “తెలంగాణ ప్రజాగర్జన” బహిరంగ సభ నిర్వహించబడింది.
జననాలు
- 1835: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు.
- 1895: గుర్రం జాషువా, ప్రముఖ తెలుగు కవి.
- 1907: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు.
- 1909: పైడి జైరాజ్, భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
- 1915: స్థానాపతి రుక్మిణమ్మ, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి.
- 1929: లతా మంగేష్కర్, గాన కోకిల.
- 1987: హిల్లరీ డఫ్, అమెరికా నటి మరియు రికార్డింగ్ కళాకారిణి
మరణాలు
- 1895: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త.
- 1968: కూర్మాపు నరసింహం, చిత్రకారుడు.
- 1973: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త.
- 1980: రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్.
- 1994: వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు.
- 2004: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత.
- 2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు.
- 2007: పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ సమాచార హక్కుల దినం.
- గన్నర్స్ డే.
- వరల్డ్ హార్ట్ డే.
- ప్రపంచ నదుల దినోత్సవం.