తిరుమలలో శ్రీవారి గరుడసేవకు భక్తులు పోటెత్తారు. రాత్రి 7.30 గంటలకు గరుడవాహనంపై శ్రీవారు ఊరేగనుండటంతో.. తిరుమాడవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. గ్యాలరీల్లోకి వెళ్లలేక మాడవీధుల్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అన్న ప్రసాదాల పంపిణీల్లో జాప్యం నెలకొనడంతో.. భక్తులకు పాట్లు తప్పడం లేదు.