మంచుకొండల మధ్య లేలేత సూర్యకిరణాలు..
నింగిని తాకే దేవదారు వృక్షాలు..
జలజలజారే జలపాతాలు, అలల అలికిడి లేని కొలనులు..
కశ్మీర్లో అడుగడుగునా ఎదురయ్యే సుందర దృశ్యాలివి.
నాణేనికి మరోవైపు అన్నట్లు కశ్మీర్ అనగానే ఇప్పుడు కాల్పులు, అల్లర్లే గుర్తొస్తున్నా..
ఆ రాష్ట్రం పర్యాటకానికి ఓ చిరునామా. ఏటా లక్షల మంది పర్యాటకులు కశ్మీర్ అందాలను వీక్షించేందుకు వస్తుంటారు.
అయితే ఈ మధ్య ఆందోళనల కారణంగా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది.
దీంతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు కశ్మీర్ టూరిజం ఓ లఘుచిత్రాన్ని రూపొందించింది.
ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తొంది.
24 గంటల్లోనే 10లక్షల మంది దీన్ని వీక్షించారు.
కశ్మీర్ అందాలు.. అక్కడి ప్రజల ఆత్మీయత గురించి పర్యాటకులకు చెప్పేందుకు ‘వార్మెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్’ పేరుతో ఓ లఘుచిత్రం రూపొందించారు.
అయితే 24 గంటల్లోనే ఈ చిత్రాన్ని 10లక్షల మందికి పైగా వీక్షించారు.