డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ( డి.సి.ఐ.) ను ప్రైవేటీకరణ చేయనున్నారన్న ప్రకటనలతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలసి డి.సి.ఐ.ని ప్రయివేటీకరణ బారి నుంచి రక్షించాలని విన్నవించారు. డి.సి.ఐ. విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైద్రాబాదులోని జనసేన పరిపాలన కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శనివారం కలుసుకుని వినతి పత్రాన్ని సమర్పించారు.లాభాలలో ఉన్నడి.సి.ఐ. సంస్థను ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం దారుణమైన విషయమని వారు అన్నారు.