ముంబై: బివాండీలోని వంజర్పట్టి నకా ఏరియాలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు విరజిమ్మడంతో అగ్నిమాక శకటాలు, సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. భవంతిలోని వారిని హుటాహుటిన బయటకు తరలించారు. ముందుజాగ్రత్తగా సమీపంలోని పెట్రోల్ పంప్‌లను మూసివేశారు. కాగా, ఈ ప్రమాదానికి కారణాలేవిటనేవి కానీ, ఏ మేరకు ఆస్తినష్టం సంభవించి ఉండవచ్చనేది కానీ వెంటనే తెలియలేదు