వరల్డ్ హార్ట్ డే సందర్భముగా , కేర్ హాస్పెటల్స్ ఆధ్వర్యంలో గుండె వ్యాధుల అవగాహనా సదస్సు , హార్ట్ కేరింగ్ క్లబ్ ప్రారంభోత్సవము మరియు హార్ట్ టు హార్ట్ శీర్షిక ద్వారా కేర్ హాస్పిటల్స్ కార్డియాక్ వైద్య బృందముచే గుండె వ్యాధులపై అపోహలు , సందేహాలను నివృత్తి చేసే కార్యక్రమము ఏర్పాటు చేసిన కార్యక్రమము విజయవంతమైనది . సీనియర్ ఇంట్రవెన్షనల్ కార్డియాజిస్ డా || పి.వి.వి.ఎన్.యం. కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న యాంత్రిక జీవన విధానము , జీవన శైలిలో మార్పులు గురించి వివరించారు . అంతేకాకుండా అత్యవసర సమయంలో చేసుకోవలసిన మందుల వివరాలు , వాటి ఆవశ్యకతను గురి ంచి వివరించారు . వరల్డ్ హార్ట్ డే ప్రాముఖ్యతను , కేర్ హాస్పిటల్స్ , గుండె విభాగము ద్వారా ఇప్పటివరకు 5 లక్షల నుందికి పైగా గుండె చికిత్సలు , 13000 లకు పైగా గుండె ఆపరేషన్లు నిర్వహించామని , ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని , అంతర్జాతీయ సేవలను అందరికీ అందుబాటులో ఉంచామని తెలియజేసారు . గుండెనొప్పి వచ్చినప్పుడు ఇచ్చే ఆధునిక చికిత్స అయినటువంటి ప్రైమరి యాంజియోప్లాస్టి , సెంటింగ్ , గోల్డెన్ అవర్ గోల్డ్ స్టాండర్డ్ చికిత్సా విధానములు గురించి ప్రముఖ సీనియర్ ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ తెలియజేసారు . డా ॥ జి.ఎస్.ఆర్ మూర్తి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గుండె లయలో వచ్చే మార్పులు , గుండె కండరాల సమన్వయం , గుండె కరెంట్ సమస్యల గురించి వివరముగా తెలియజేసారు . ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డా ॥ రాకేష్ దుబ్బ , ఈ విభాగము మెట్రో నగరాలకు పరిమితమైన ఎలక్ట్రోఫిజియాలజీ చికిత్సలు పూర్తి స్థాయిలో మన విశాఖపట్నం కేర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచామని తెలియజేసారు . ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డా ॥ గిరిధర్ హరిప్రసాద్ మాట్లాడుతూ … ఆధునిక విధానము ద్వారా గుండె ఆసకుండా నిర్వహించే బైపాస్ ఆపరేషన్ వాల్వ్ రీ – ప్లేస్మెంట్ సర్జరిల గురించి మరియు తక్కువ పంపింగ్ ఉన్నవారికి అందించే ప్రత్యేక శస్త్ర చికిత్సల గురించి . వివరించారు . కేర్ హాస్పిటల్స్ గుండె మార్పిడి చికిత్సలకు గుర్తింపు పొంది , మెట్రో నగరాలకు ధీటైన చికిత్సలు అందజేస్తోందని తెలియజేసారు . ప్రముఖ సీనియర్ ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డా ॥ సి.వి. రావు మాట్లాడుతూ , దైనందిన జీవనవిధానం అనేక రుగ్మతలకు , వ్యాధులకు కారణమవుతోందని , వైద్యులుగా అవగాహన కల్పించడం , ప్రాణాంత వ్యాధి గురించిన తగు సూచనలు చేసి అందరికీ సరైన సమయానికి సరైన చికిత్స అందించడం తమ కర్తవ్యమని తెలియజేసారు . హాస్పిటల్ ముఖ్య పరిపాలనాధికారి వద్దిపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ , కేర్ హాస్పిటల్స్ సుదిర్గ ప్రస్థానంలో ఎంతోమందికి అందించిన అత్యవసర చికిత్సలను , వాటిని అందించడంలో తమ శక్తి వంచన లేకుండా కృషిచేసిన హార్ట్ కేర్ వైద్య బృందమును ప్రత్యేకముగా అభినందించారు . ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు అందరికి కేర్ అందించడం మా సామాజిక బాధ్యత అని తెలియజేసారు . కేర్ హార్ట్ కేరింగ్ క్లబ్ల్ను ఈ సందర్భముగా ప్రారంభం చేసి , తద్వారా అందించు రాయితీలను అందిస్తున్న సేవలను వివరముగా తెలియజేసారు . కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యవసర సమయంలో అందించే ప్రత్యేక మందులను అందరికీ ఉచితముగా అందచేసారు . కేవలం అత్యవసర సమయంలోనే మందులు ఉపయోగించాలని లేని అవగాహన లేమితో ఉపయోగిస్తే ప్రాణాంతకమవుతాయని వైద్యుల సూచన మేరకే వాడాలని సూచించారు . సుమారు 200 లకు పైగా ప్రజలు , హాస్పిటల్ ఇతర విభాగమునకు చెందిన వైద్యులు , సిబ్బంది పాల్గోన్నారు .