విశాఖ: దక్షిణ కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో పీడనశక్తి అధికంగా ఉంది. తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఛత్తీస్గఢ్ పరిసరాల్లో వున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్యప్రదేశ్లో కేంద్రీకృతమై వుంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. ఇంకా ఎండ తీవ్రత నెలకొంది. వీటన్నింటి ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో పలుచోట్ల, తెలంగాణ, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా గురువారం గల్ఫ్ ఆఫ్ సైమ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అయితే ఇది బలపడితే తప్ప దానిపై అంచనా వేయలేమని వాతావరణ నిపుణులు వెల్లడించారు