సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో ‘స్పైడర్’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది. హేరిస్ జయరాజ్ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్ అయి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కాగా, సెప్టెంబర్ 15 సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చే అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఈ ఫంక్షన్లో ‘స్పైడర్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్సి.ఐఎస్సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.