అఖిల భారతీయ ఆకార పరిషత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆశారాం బాపు, రాధేమా, గుర్మీత్ సింగ్‌లు నకిలీ బాబాలు అంటూ మండిపడింది. సుమారు 14 మంది నకిలీ బాబాలు ఉన్నారంటూ వారి జాబితా విడుదల చేసింది.
ఇందులో ఆశారాం బాబు, రాధేమా, సచ్‌దరంగి, గుర్మీత్, ఓం బాబా, నిర్మల్ బాబా, విశ్వానంద్, స్వామి అశ్మిదానంద్, ఓం నమః శివాయ్, నారాయణ్ సాయి రాంపాల్‌లు ఉన్నారు.ఆర్త్ కుంభ మేళా పేరుతో ఆకార పరిషత్ అధ్యక్షుడు నరేంద్రగిరి సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా గిరి మాట్లాడుతూ బాబాలుగా చెప్పుకొంటూ ప్రజలను మోసం చేస్తున్న ఈ 14 మందిని అరెస్టు, జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి దొంగ బాబాలను అరికట్టే విధంగా సరికొత్త చట్టాలు తీసుకురావలని కేంద్రాన్ని కోరారు.వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు.