విశాఖపట్నంలో ఐటీ కార్యకలాపాల కోసం స్థలాలు తీసుకొని పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.విశాఖలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో ఇంతవరకు కార్యకలాపాలు ప్రారంభించని వారందరూ మూడు నెలల్లోగా ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని వివరించారు.అలా చేయని పక్షంలో ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.