అయ్యన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి పోలీస్ అధికారుల సంఘం Visakhapatnam Vizag Vision అయ్యన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి పోలీస్ అధికారుల సంఘం శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు విధులు నిర్వహించే పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం (జే.ఏ.సి) ఉపాధ్యక్షులు స్వర్ణలత డిమాండ్ చేశారు. బుధవారం నర్సీపట్నంలో జరిగిన ఓ సభలో అయ్యన్నపాత్రుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు. పోలీసు వ్యవస్థను కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. ఇటీవల మాటమాటికీ అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకుంటున్నారన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ వ్యవస్థకు మూడిపెట్టడం సరికాదని, చట్టం న్యాయం తెలుసుకొని ఆయన మాట్లాడితే బాగుంటుందని సూచించారు. పోలీసులు ఖాకీ దుస్తులను ముఖ్యమంత్రి కాళ్ళకి తాకట్టు పెట్టారని అయ్యన్న వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు. పోలీసు మూడు సింహాలు సిగ్గు పడ్డాయని మాజీ మంత్రి అన్నారని, ఆ సింహాలు అయ్యన్నను చూసి సిగ్గు పడుతున్నాయన్నారు. పోలీసులను బట్టలూడదీసి తరిమికొట్టాలని. అయ్యన్నపాత్రుడు అన్నారని, అతనిని ఆ విధంగా ప్రజలే తరిమి కొడతారని తెలిపారు. కోవిడ్, వరదల సమయంలో పోలీసులు ప్రాణాలర్పించి విధులు నిర్వహిస్తున్నారని, ఇటీవల చిత్తూరు వరదల్లో కానిస్టేబుల్ ఒకరిని కాపాడి ప్రాణాలు కోల్పోయారని, విధినిర్వహణలో మూడో పట్టణ సీఐ కరణం ఈశ్వరరావు ప్రాణాలర్పించారన్నారు. ఈ విధంగా పోలీసులు ప్రాణాలు కోల్పోయి ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ఉంటే ఈ విధంగా మంత్రి మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టాలు ఇప్పటికి అమలులో ఉన్నాయని, అందరికీ ఒకే చట్టం అన్నది మాజీ మంత్రి తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శేషగిరిరావు మాట్లాడుతూ పోలీసులపై తిరగబడండని అయ్యన్నపాత్రుడు ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. అయ్యన్నపాత్రుడు పదవిలో ఉన్నప్పుడు బాగున్న పోలీసులను, ఇప్పుడు బాగోలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హెూం మంత్రికి, డీజీపీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం సభ్యులు డీ లలిత, టి అనిల్, ఎన్ శేషాద్రి పాల్గొన్నారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/