గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ ఆకాశం వైపు చూస్తున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ కారణంగా డిమాండ్ బాగాపుంజుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు ఒక సంవత్సరం స్థాయికి చేరుకున్నాయి. దేశీయంగా కూడా ఇదే ధోరణి నెలకొంది. బంగారం ధరలు రూ. 30,500 (ఒక సంవత్సరం గరిష్టం) వైపు దూసుకుపోతున్నాయి.
ప్రపంచ బంగారం ధర గత ఏడాది సెప్టెంబరు 1,344.21 డాలర్లను తాకింది. నేడు గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు ఔన్స్ రోజుకు 1,339.87 డాలర్లవద్ద ఉంది. దేశీయ బంగారు ధరలు ప్రపంచ ధరలను అనుసరిస్తూ లాభాల్లో ట్రేడ్అవుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా పసిడి రూ. 15 ఎగిసి రూ. 30,238వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అక్టోబర్ బంగారు ఫ్యూచర్స్ రూ. 30,230గా ఉంది. వెండి కేజీ డిసెంబర్ డెలివరీ కేజీ రూ. 41,421కు చేరింది.
నార్త్ కొరియా సృష్టిస్తున్న యుద్దమేఘాలు, దేశీయంగా దిగుమతి సుంకం, డాలర్-రూపాయి విలువ కూడా దేశీయ బంగారు ధరలు ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. త్తర కొరియా సంక్షోభం కొనసాగితే బంగారు ధరలు మరింత పుంజుకుంటాయని కొంతమంది విశ్లేషకుల అంచనా. ఈ సంక్షోభ పరిస్థితి కొనసాగినట్లయితే, భారతీయ మార్కెట్లలో ఫ్యూచర్స్ ధర 10 గ్రా. రూ.30,500 మార్కును అధిగమిస్తుందని ఏంజిల్ బ్రోకింగ్ ఎనలిస్టు ప్రథమేష్ మాల్య చెప్పారు.
ఇదిలా ఉండగా డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు వారాల కనిష్ఠానికి పడిపోయింది. రూ.0.7నష్టపోయి రూ.64.20 వద్ద ఉంది. అయితే దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్రమైన ఊగిసలాటలమధ్య కొనసాగుతున్నాయి. ఒక దశలో 200 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుత 165 పాయింట్లు క్షీణించి 31, 645వద్ద నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 9908వద్ద ఉంది.