‘అమరావతి: ఈనెల 6వతేదీనుంచి 8వతేదీ వరకు రాష్ట్రంలో ‘జలసిరికి హారతి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆయా ప్రాంతాల్లోగల జలవనరులు, ప్రాజెక్టుల వద్ద జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నీరు-ప్రగతి కింద ప్రధానంగా జలవనరుల శాఖ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. అయితే… ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు, విద్యార్ధులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.