చాగల్లు జైపూర్ సుగర్స కార్మికులు మరియు సిబ్బంది కి యాజమాన్యం వారు గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగులకు రావలసిన పాత బకాయిలు మరియు పది నెలలుగా జీవితములు మరియు ప్రావిడెంట్ ఫండ్ రెండు సంవత్సరముల నుంచి చెల్లించుట లేదు. ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న కో-ఆపరేటివ్ క్రీడిట్ సొసైటీ లో ఉన్న డబ్బు సుమారుగా 80 లక్షలు రూపాయలు వాడుకుని తిరిగి సంఘానికి చెంల్లిచ లేదు. ఆపరేటర్ రిజిస్టర్ వారకి ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదు. maa వేతనములు పాత బకాయిలు కోసం లేబర్ డిపార్ట్ మెంట్ వారు ని చాలా సార్లు కలిశాము. అయినను ప్రయోజనం లేదు. చివరిగా కార్మిక శాఖ మంత్రులు శ్రీ పితాని సత్యనారాయణ గారిని కలిసి ఫిర్యాదు చేసినాము. ఆయన మాకు యాజమాన్యం వారికి లేబర్ డిపార్టుమెంటుకు జాయింట్ మీటింగు వేసిన ప్రయోజనం లేదు. చివరకు విసుగు చెంది రిలే నిరాహార దీక్షలు చేయుచున్నాము
BJP రాజమండ్రి శాసన సభ్యులు ఆకుల సత్సనారాయణ గారు,నీరుకొండ వీరన్న చౌదరి గారు,ఆదినారాయణ గారు ఈ రోజు జైపూర్ షుగర్స్ ఎంప్లాయీస్ సఘీభావం తెలిపారు.5 వ రోజు ధీక్ష..10 నెలల వేతనములు,2 సంవత్సరాలుగా చెల్లించని పాత బకాయలు,రెండు సంవత్సరముల నుండి చెల్లించని ప్రావిడెంట్ ఫండ్ మెదలగు సమస్యలపై చేయుచున్న రిలే నిరాహార ధీక్షా 5 రోజుకు చేరింది.ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి బకాయలు చెల్లించనిచో పరిస్దితులు చాలా తీవ్రపరిణా దాల్చే అవకాసాలు ఉన్నయి.INTUC నాయకులు,రాజమండ్రి నగర కాంగ్రెస్ నాయకులు&INTUC నాయకులు N.V.శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నాయకులు రఫీ ఉల్లాబేగ్ గారు ఈ రోజు జైపూర్ షుగర్స్ చాగల్లు వచ్చి సంఘీభావం ప్రకటించారు.KCP ఉయ్యూరు వారు మా కంపెనీ తీసుకోంటుంన్నామని ఫిబ్రవరి లో మీటింగ్ పెట్టి మీ బకియలు three వాయిదాలలో ఇస్తామని హామీ ఇచ్చిరు.తరువాత జూన్ లో మీటింగ్ పెట్టి కొన్ని బిల్స్ మీరు వదులుకోవాలి అన్నారు.కానీ ఇప్పుడు పాతబకాయిలు మాకు సంబందం లేదని మాటమార్చు తున్నారు.దీనితో కార్మికులు ఆందోళన చెందుతున్నారు