దేశీయ రెండో దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేశారు.
తనపై వ్యక్తిగత విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో తాను సీఈవో పదవిలో కొనసాగలేనని సిక్కా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు.
అయితే సిక్కా వైదొలగడానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తినే కారణమని అటు బోర్డు వర్గాలు, ఇటు కార్పొరేట్ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సిక్కాతో నారాయణమూర్తి బ్లూవేల్ గేమ్ ఆడించారని, ఆయన పదవి నుంచి బలవంతంగా తప్పుకునేలా చేశారని.. అయితే ఇది తమ సొంత అభిప్రాయం మాత్రమేనని కార్పొరేట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల ఇన్ఫీ వ్యవస్థాపకులు, సంస్థ మేనేజ్మెంట్ మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి.
బోర్డు పాలనలో లోపాలున్నాయని మూర్తి పదేపదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేగాక, ఉన్నతస్థాయి ఉద్యోగుల జీతాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే సిక్కాతో అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది