భూమిని కబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని YCP అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు in Visakhapatnam,Vizagvision…విశాఖ పెందుర్తి మండలం చిన్నముసిడివాడ గ్రామంలో తనకు చెందిన భూమిని కబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని
వైఎస్ఆర్సీపీ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు అన్నారు. వి జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 186 సర్వేనెంబర్ లో 10.30 ఎకరాల భూమి ముత్తాతల నుంచి తనకు వచ్చిందన్నారు. అయితే పెందుర్తి లోని కొందరు టిడిపి నాయకులు వారి ఉనికిని చాటుకునేందుకు మైలపూడి ఈశ్వరరావు అనే వ్యక్తితో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కాజేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు తెలిపారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తున్న తనకు పక్క వారి భూములు లాక్కునే అవసరం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.