Srikankamahalakshmi Ammavari Margasira Masotsavalu From 15th December to January 13th in Visakhapatnam,Vizagvision….
15 నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం
* జనవరి 13 వరకు ఉత్సవాలు కొనసాగింపు
*దర్శనమునకు విచ్చేయు భక్తులకు
నో మాస్క్ – నో ఎంట్రీ , నో స్లాట్ – నో ఎంట్రీ పద్దతి
ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన వరాలిచ్చే కల్పవల్లి విశాఖ నగరం బురుజుపేట లో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వార్షిక మార్గశిర మాసోత్సవాల పూజలు ఈనెల 15 నుంచి జనవరి నెల 13 వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కలెక్టర్ ఎస్. జ్యోతి మాధవి తెలియజేశారు. శనివారం ఉదయం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె ఉత్సవాల వివరాలను వివరాలను వెల్లడించారు. మార్గశిర మాసోత్సవాలు ఈ నెల 15న మంగళవారం ఉదయం 10: 10 గంటలకు వైదిక కార్యక్రమాలతో మొదలవుతాయని తెలిపారు. ఈ మార్గశిర మాసోత్సవాలు మాసోత్సవాల ప్రారంభోత్సవానికి స్థానిక రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈనెల 17, 24 , 31 వచ్చే జనవరి నెల 7 తేదీన మొత్తం నాలుగు మార్గశిర గురువారాలు ఉన్నాయని ఆ రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పంచామృత, స్వర్ణ భరణ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కోవిడ్ -19 నిబందనలు కారణంగా మార్గశిర మాసోత్సవములలో అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులకు
“ నో మాస్క్ – నో ఎంట్రీ , నో స్లాట్ – నో ఎంట్రీ పద్దతిలో నిర్వహించబడునని అందువల్ల భక్తులు అమ్మవారి ఉచిత దర్శనంతో సహా అన్ని రకాల దర్శనములకు ముందుగా స్లాట్ బుక్ చేసుకొనవలెనని దేవస్థానం ఈవో ఎస్ జ్యోతి మాధవి తెలియజేశారు. ఆలయ ప్రాతంలో ఎటువంటి దర్శన టిక్కెట్లు విక్రయింపబడవని, దర్శన స్లాట్ పొందగోరు భక్తులు జగదాంబ జంక్షన్ లో ఉన్న అంబిక బాగ్
సీతారామచంద్ర స్వామి దేవస్థానం, విశాఖ పాత నగరంలోని టౌన్ కొత్త రోడ్డు జగన్నాధ స్వామి దేవస్థానలలో అడ్వాన్స్ స్టాట్ స్లీప్ జారీ చేయుట జరుగుచున్నదని తెలిపారు.
ఈ నెల 7 నుండి ప్రారంబించబడిన దర్శన స్లాట్ కు భక్తుల నుండి స్పందన పెరుగుతున్నదని, ఇప్పటివరకు ఐదు వేల మంది భక్తులు స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు.ప్రతి రోజు ఉదయం 9.00 గం.ల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు అడ్వాన్స్ స్లాట్ స్లీప్ తీసుకొనవలెనని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనాలకు 100, 200, 500 రూపాయలు అడ్వాన్స్ స్లాట్ స్లీప్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ స్లీప్,ఆదార్ కార్డ్ లేనిదే అమ్మవారి దర్శనమునకు అనుమతించబడదని భక్తులు గమనించాలని సూచించారు. ఈ వయోవృద్ధులకు, 10 సంవత్సరములోపు పిల్లలకు, దివ్యాంగుల భక్తులకు కోవిడ్ -19 నియమ నిబందనల ప్రకారం అమ్మవారి దర్శనములకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రోటోకాల్ దర్శనాలకు ఉదయం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనాలు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. మార్గశిర మాసోత్సవాలలో సాధారణ రోజుల్లో 6 వేల మంది భక్తులకు, మార్గశిర గురువారం పూజలకు 12000 భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రశాంత వాతావరణంలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు పోలీసులు ప్రభుత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తామని దేవస్థానం ఈవో ఎస్ జ్యోతి మాధవి పేర్కొన్నారు.మార్గశిర మాసోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ అవుట్ పోస్టు, పలుచోట్ల సీసీ కెమెరాలు, అన్ని చోట్ల పోలీసు బందోబస్తు, అగ్నిమాపక వాహనాలు, ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో మాధవి పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్నదాన ప్రసాద వితరణ రద్దుచేసి మార్గశిర ఉత్సవాలు పురస్కరించుకొని ప్రతినిత్యం 1000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మార్గశిర గురువారం ప్రత్యేక పంచామృత
పంచామృతాభిషేకం పూజలకు పూజలకు 7, 500, మిగతా రోజుల్లో 2,500 రూపాయలు చెల్లించి ఆన్లైన్ ద్వారా పూజలు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్ర బ్యాంకు ఎకౌంటు నెంబర్ 060810011006691 IFSC కోడ్ ANDB0000608 కు పూజల రుసుములు చెల్లించాలన్నారు. అమ్మవారి ఆలయంలో వచ్చే నెల 3 తేదీన అర్చక సదస్సు, వేద సభ , ఏడో తేదీన సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో దేవస్థానం అసిస్టెంట్ ఈవో లు పులి రామారావు, వి. రాంబాబు, ఆలయ డిప్యూటీ ఇంజనీర్ సిహెచ్. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.