నిధులు ఇచ్చారు,పనులు మరిచారా? ఆ రోడ్డుపై జర్నీ అంటే భయ పడాల్సిందే,కురుపాం,పార్వతీపురం in Vizagnagram,Vizagvision నిధులు ఇచ్చారు. పనులు మరిచారా?
* ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ జామ్
* ఆ రోడ్డుపై జర్నీ అంటే భయ పడాల్సిందే
* మరణం అంచులపై తప్పని ప్రయాణం
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపాం నియోజకవర్గం
కొమరాడ మండలంలో అంతర్రాష్ట్ర రహదారి పై గుంతలను చెప్పేందుకు కు రోడ్డు మరమ్మతులు నిమిత్తం సెప్టెంబర్ నెల 19వ తేదీన అధికారికంగా 1 కోటి ఆరు లక్షల రూపాయలను ఉత్తరాంధ్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మంజూరు చేశారు, కానీ నేటి వరకు ఆ దిశగా ఎక్కడ రోడ్డు మరమ్మతు పనులు జరగక పోవడంతో రోజురోజుకు పార్వతీపురం నుండి కూనేరు వరకు అంతర్రాష్ట్ర రహదారిపై గోతులు గుమ్ములు పెరిగిపోతున్నాయి, ఆదివారం చోళ్ళ పదం వద్ద రెండు వైపుల నుండి లారీలు దిగిపోవడంతో సుమారు పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది, స్థానిక ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జెసిబి సాయంతో కొంతవరకు ట్రాఫిక్ని క్లియర్ చేయించారు, అటుగా వచ్చి వెళ్లే వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో ఇరుకుంటున్నారు, అంతేకాకుండా ఇటీవల ఇదే రోడ్డుపై బైక్ పై నుంచి పడి చనిపోయిన వాళ్ళు కాళ్లు చేతులు విరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కార్, ఆటో, జీపుల వంటి వాహనాలు బంపర్ లు విరిగిపడి డామేజ్ తగిలించుకుని వాహనాలు నడపడపాల్సిందే, ఇక భారీ వాహనాలు కర్రలతో వెళ్లే భారీ వాహనాలు క్రింద పడాల్సిందే, విజయనగరం జిల్లాలో ఏ ప్రయాణికుడు అయినా ఈ రోడ్డుపై జర్నీ అంటే భయపడాల్సిందే, అయినా మండలంలోని వాహనదారులు ప్రయాణికులు ప్రమాదపు అంచుల్లో తప్పని ప్రయాణం చేయాల్సిందే, ఇక మండల కేంద్రానికి వచ్చే వివిధ శాఖల అధికారులు బాధలు వర్ణనాతీతం, మండల కేంద్రంలో పనిచేసే అధికారులంతా బయటి ప్రాంతాలు నుండి వచ్చేవారు కావడంతో బస్సు సౌకర్యం లేదు, విధులు నిర్వహించాలంటే టూ వీలర్ పై స్కూటీ లపై ప్రయాణం భయంతో నడవాల్సిందే, నిధులు మంజూరు చేసి నెల రోజులు అయినప్పటికీ ఆ దిశగా రోడ్డు మరమ్మతు పనులు మొదలుపెట్టక పోవటం లో గల ఆంతర్యమేమిటోనని పలువురు గుసగుసలాడుకుంటున్నారు, అధికార ప్రతినిధులు, రాజకీయ నాయకుల పీసీల విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ల వెనుకడుగు వేస్తున్నారని ఓ సమాచారం వైరల్ అవుతుంది