ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవ కమిటీ 20 20 రాష్ట్రస్థాయిలో జర్నలిస్ట్ విభాగంలో ఉత్తమ జర్నలిస్టు అవార్డు ను విశాఖపట్నం వారథి దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ బందరు శివప్రసాద్ ఎన్నికయ్యారు ఈ అవార్డును బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టీస్ ఈశ్వరయ్య చేతుల మీదుగా అందుకున్నారు
విజయవాడ పున్నమి గెస్ట్ హౌస్ లో గురువారం సాయంత్రం విశ్వకర్మ జయంతి అవార్డుల ప్రధానోత్సవం లో మంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ సంఘాలు అన్నీ ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు విశ్వకర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే నని ఈ సందర్భంగా మంత్రి అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో విశ్వకర్మ జయంతి చైర్పర్సన్ పార్వతమ్మ వ్యవస్థాపక అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ తో పాటు పలువురు కమిటీ సభ్యులతో పాటు విశ్వబ్రాహ్మణ సభ్యులు పాల్గొన్నారు