రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలు పై దాడులు జరుగుతున్నాయి బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు In Visakhapatnam,Vizag Vision…
రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలు పై దాడులు జరుగుతున్నాయి.
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అవుతుంటే రాష్ట్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
బిట్ర గుంట, పిఠాపురం లో కూడా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అసలు రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్ర ప్రదేశ్లో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలు పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి.
లేని పక్షంలో కేంద్రం కఠినం గా వ్యవరిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా..హిందుత్వాన్ని పరిరక్షింస్తుందా లేదా తేల్చి చెప్పాలి.
రాష్టంలో దేవాలయాలలో జరుగుతున్న పరిణామాలు పై బీజేపీ తరపున ఒక కమిటీ వేస్తాం.
అంత్యర్వేది ఘటన పై టిడిపి మాట్లాడే హక్కు లేదు .
గోదావరి,కృష్ణ, పుష్కరాల సమయంలో ఎన్నో దేవాలయాలు టిడిపి ప్రభుత్వం కూల్చి వేసింది.
టిడిపి, వై సి పి లు మతతత్వ రాజకీయాల పంథాలలో వెళ్తున్నారు.
టిడిపి మేనిఫెస్టో లో సైతం క్రైస్తవులు మేలు చేసే అంశాలు ఇచ్చారు..
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చర్చి నిర్మాణం కోసం నిధులు ఇస్తోంది.
టిడిపి, వైసీపీ, వాళ్ళకి సవాల్ చేస్తాను.టిటిడి నిధులతో దేవాలయ నిర్మాణం చేస్తాం అంటున్నారు.చర్చిలకి వచ్చే ఆదాయం తో చర్చిలు నిర్మాణం చేయగలరా.
చర్చిలు ఆస్తుల పై కమిటీలు వేయగలరా.
టిటిడి బోర్డ్ లో రాజకీయనాయకులు కాకుండా, స్వామీజీ లతో బోర్డ్ ఏర్పాటు చేస్తాం.
2024 లో అన్ని మతాలకు మేలు చేసేలా మేనిఫెస్టో రూపొందిస్తాం…
మత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాము.
రాష్ట్రం లో హిందుత్వానికి విఘాతం కలిగించే విధంగా ఎవరు వ్యవరించిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
టీడీపీ ,వైసీపీ పార్టీ లు కుటుంబ పార్టీలు.
రాష్ట్రం లో దేవాలయాలు భూములు విషయం లో ప్రభుత్వం జి ఓ లు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఒక సెంటు దేవాలయం భూమి అన్యాక్రాంతం అయిన బీజేపీ ఒప్పుకోదు.
అంతర్విది సంఘటన పై నేను వెంటనే సిటింగ్ న్యాయమూర్తి తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కి లేఖ రాసాను.