CPI J.V. Satyanarayana Comments on Government Smart Meters for Free Electricity Press Meet In Visakhapatnam,Vizag Vision…
వ్యవసాయ మోటారుకు స్మార్ట్ మీటర్లు రైతు మెడకు ఉరితాడే – సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. వి.సత్యనారాయణ మూర్తి
విశాఖపట్నం:- 2000 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్న 18.26 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఏప్రిల్ 01 వ తేదీ లోగా స్మార్ట్ మీటర్లు బిగించడమంటే రైతు మెడకు ఉరితాడు వెయ్యడమేనని, సీపీఐ ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలు తీవ్రంగా ప్రతిగటిస్తుందని, ఈ ప్రాజెక్టును ప్రారంభించే శ్రీకాకుళం నుండే మరో విద్యుత్ ఉద్యమ పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఐ రాష్ట్ర
సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి వెల్లడించారు.
మంగళవారం సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగ సంస్థలు ప్రైవేటీకరించడం కుట్ర లో మొదటి భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి సవరణ తీసుకురావడం రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ పథకానికి తెర దించింది. జీఎస్టీ తో ప్రారంభించి రాష్ట్రాల అధికారాలు ఒక్కొటిగా కేంద్రం హరించివేస్తుంది. రాజ్యాంగం పకారం రాష్ట్రాలకి ఉన్న హక్కులను కేంద్రం హరిస్తున్నా రాష్ట్రంలోని అధికార వైసిపి ప్రభుత్వం గాని ప్రధాన ప్రతిపక్షం టిడిపి గాని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా ఇరు పక్షాలు ఒకరినొకరు విమర్శించుకుంటూ రాష్ట్ర హక్కులని ప్రయోజనాల్ని కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారు. 2000 వ సంవత్సరంలో విద్యుత్ సంస్కర్తల పేరుతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ప్రజలపై మోపిన భారాలకి వ్యతిరేకంగా
జె వి సత్యనారాయణ మూర్తి తెలిపారు
విద్యుత్ పోరాటాన్ని వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి, భషీర్ ఖాగ్ లో ముగ్గురి ప్రాణత్యాగంతో ప్రజలపై చంద్రబాబు నాయిడు మోపే భారాలని నిలవరించాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కేంద్రంతో పోరాడకుండా వ్యవసాయ విద్యుత్ కనక్షన్లకు మీటర్లు పెట్టి నగదు బదిలీ ద్వారా రైతుల మీద భారం లేకుండా చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్తు భవిషత్తులో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ లేకుండా చేసే కుట్రకి పూనుకుంటుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఇన్ని మెలికలు పెట్టడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, అన్నదాతలు ఆత్మహత్యల్లో దేశంలో 03 వ స్థానంలో, కౌలు రైతులు ఆత్మహత్యల్లో 02 వ స్తానం లోను ఆంధ్రప్రదేశ్ ఉన్నదని రైతులు ఉచిత విద్యుత్ కు మంగళం పాడేందుకే రైతులకు ఉచితంగా ఇచ్చే విద్యుత్ కోసం స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సత్యనారాయణ మూర్తి అన్నారు వైసిపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో వామపక్షాలు, రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చైతన్యం కల్పించి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. శ్రీకాకుళంలో ప్రయోగాత్మకంగా మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్న జిల్లానుండే ఉద్యమాన్ని ప్రారంభిస్తాం.
సింహాచలం దేవస్థానం భూములు కొట్టేయ్యడానికే వంశపారంపర్య ట్రస్ట్ సంచయిత నియామకం
కొన్ని నెలలుగా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా రోజుకు 3 వేల రూపాయలు అద్దె గల సింహాచలం దేవస్థానం కాటేజీలో ఉచితంగా అనధికారికంగా ఉంటూ దేవస్థానం భూములు, ఆదాయ వనరులు వివరాలు గోష్యంగా తనిఖీ చేస్తున్న కార్తీక్ సుందర రాజన్ ఎవరు అని, ఎవరి ప్రోద్బలంతో అంతా జరుగుతున్నదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు స్వయంగా కార్యనిర్వాహక అధికారి భ్రమరాంబ ఆగస్టు 30 వ తేదీన సింహాచలం దేవస్థానం పాలకమండలి అధ్యక్షురాలైన సంచయితకు తొమ్మిది అంశాలతో రాసిన లేఖలో పేర్కొన్నారని, దేవాదయశాఖకి రెవెన్యూ శాఖకు మధ్య వివాదంలో చిక్కుకున్న సింహాచలం దేవస్థానం భూముల సమస్య పరిష్కారానికి కృషి చెయ్యకుండా దేవస్థానం తాలూక విలువైన భూములు కాజేయడానికి పన్నిన పన్నాగంగా టీ న్నదని, దీనిపై ప్రజలకు స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత చైర్ పర్సన్ అయిన సంచయితకు ఉందని, ఈ వ్యవహారం చూస్తుంటే దీనిపై దేవాదయ శాఖ కూడా దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలపై తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి ఎం. పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.విమల పాల్గొన్నారు.