కూటమి ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు…..రాష్ట్రంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ సింకా గ్రాండ్ లో నిర్వహించిన ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టులకు టిడ్కో ఇళ్లు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని ఆయితే ఆ ప్రక్రియ వేర్వేరు కారణాలుతో ముందుకు సాగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకుండా ఆఖరి నిమిషంలో ప్రతీ జర్నలిస్టుకు మూడుసెంట్లు ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించిన తరువాత పట్టించుకోలేదన్నారు. ఏళ్ల తరబడి జర్నలిస్టుల ఇంటి కల నెరవేరకపోవడం విచారకరమన్నారు. అలాగే అక్రిడేషన్లు, అటాక్స్ కమిటీలు పునరుద్దరించడంతో పాటు అన్ని సంఘాలకు ఆయా కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని తాము కోరుతున్నామన్నారు. ఆయా విషయాలను తమ రాష్ట్ర కార్యవర్గం ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు నివేదించనున్నట్లు శ్రీసుబాబు చెప్పారు. ఇప్పటికే ఆయా నేతల అపాయింట్ మెంట్లు తాము కోరడం జరిగిందన్నారు. ఏపివర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి. నారాయణ్, కార్యదర్శి జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ విశాఖ పరిధిలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామ న్నారు. అలాగే పెండింగ్ సమస్యలను గుర్తించి తక్షణమే వాటిని పరిష్కరించేందుకు తమ పరిధి మేరకు ప్రయత్నిస్తా మన్నారు. అన్ని పండుగల నిర్వహణతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సమావేశం లో ఫెడరేషన్ కార్యవర్గం ప్రతినిధులు ఏ. సాంబశివరావు, రవి కుమార్ పితాని ప్రసాద్. రామకృష్ణ, శివ ప్రసాద్, ఎం ఎస్సార్ తదితరులు పాల్గొన్నారు.



ఏపి బ్రాడ్ కాస్ట్ విశాఖ అర్బన్ నూతన కార్యవర్గం సమావేశం అనంతరం ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ అర్బన్ యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. తొలుత జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్నికల అధికారి) గంట్ల శ్రీనుబాబు నామినేషన్లు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని శ్రీనుబాబు నారాయణ్ లు ప్రకటించడం జరిగింది. ఆర్బన్ యూనిట్ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇరోతి ఈశ్వరరావు (మెట్రో టీవి), డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పి.నర్సింగరావు (టి.వి.9), కార్యదర్శిగా కె.మధన్ (విన్యూస్) ఉపాధ్యక్షులుగా అనురాధ (హెచ్ ఎమ్ టివి), నాయుడు (సాక్షి), కె.బాబూరావు (టి.వి 9), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.భాస్కర్ (ఈటివి), మళ్ల దేవత్రినాధ్ (వైజాగ్ విజన్), నాయుడు (విడిజిటల్), కోశాధికారిగా సిహెచ్ రాజశేఖర్ (ఏబిఎన్), సంయుక్త కోశాధికారిగా ఏ.సురేష్ (విడిజిటల్), జాయింట్ సెక్రటరీలుగా ఏ.శేషు (టివి-5), కోరాడ శశిభూషణరావు (సాక్షి) బి.రాజు (వీడియో జర్నలిస్టు), బి.రాము (విటివి), కార్యవర్గ సభ్యులుగా జిఆర్ ఎస్ రమేష్, ఎన్.నెలరాజు, , గోపీనాధ్, బి.అప్పలనాయుడు తదితరులను ఎన్నుకోవడం జరిగింది.
















