TDP Ex Minister Ayyana Patradu Government Has Completely Failed Control Prices of Essential Commodities in Visakhapatnam,Vizagvision…
నిత్యావసర వస్తువుల ధరలు కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
—మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
కరోనా కేసులు మన రాష్ట్రంలో 4లక్షల35 వేల కి చేరింది. పేషెంట్స్ కి సరైన ట్రీట్మెంట్ లేదు, బెడ్స్ కూడా అందుబాటులో లేవు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ అవ్వాలంటే లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలామంది కి ట్రీట్మెంట్ అందక, హాస్పిటల్ బయటే ప్రాణాలు వదిలే పరిస్థితి కూడా చూసాం. ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడమే దీనికి కారణం.
పనులు దొరక్క పేదలు, మధ్యతరగతి వారు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే, ఈ సమయంలో నిత్యావసర సరుకులపై అధిక ధరలు పెంచడం వలన పేదలపై మరింత భారం పడింది. ఈ సంవత్సర కాలంలోనే ఒక లీటర్ వంట నూనె పైన 10 రూపాయల 30 పైసలు పెరిగింది, చింతపండు ధర 48 శాతం పెరిగింది, పెసర, మినుములు రేట్లు పెరిగిపోయాయి. ఈ భారం అంతా పేద, మధ్యతరగతి కుటుంబాలపైనే పడింది. ఈ ధరలు కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన 15 నెలల్లో ఒక్క ప్రాజెక్టు కూడా కూడా కట్టలేదు, ఒక పరిశ్రమ కూడా తీసుకు రాలేదు. అతని అవినీతిని చూసి కొంతమంది పరిశ్రమలు కూడా పెట్టకుండా పారిపోయారు. ఎక్కడ చూసినా అవినీతి, ఇసుక విషయంలో అవినీతి, మద్యంలో అవినీతి, ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణలో అవినీతి, నాడు-నేడు కార్యక్రమం లో అవినీతి, ఆఖరికి బ్లీచింగ్ పౌడర్లో కూడా అవినీతికి పాల్పడ్డారు.
ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో 8 వేల కోట్లు మన రాష్ట్రానికి ఇస్తే, ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా చెప్పడం లేదు, దానిలో కూడా అవినీతి చేసే ఉంటారు.
ఈ 15 నెలల్లో మన రాష్ట్రాన్ని అప్పులుపాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈయన గారు తెచ్చిన అప్పులు మనం ఒక్కసారి విశ్లేషిస్తే 1 గంటకు 9 కోట్ల చొప్పున అప్పు ఉంది. అలాగే ప్రతి నిమిషానికి 15 లక్షల అప్పు ఉంది.
ఈ విధంగా 15 నెలల్లోనే లక్ష కోట్ల అప్పు తెచ్చాడు, ఈ డబ్బులు ఏం చేశారంటే, గత ఏడాది నీటిపారుదల నీటిపారుదల శాఖ కు 5 వేల కోట్లు ఖర్చు పెట్టారు, గృహ నిర్మాణానికి 10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, వ్యవసాయానికి 20 వేల కోట్లుఅని బడ్జెట్ లో చూపించి, కేవలం 7 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మరి మిగిలిన డబ్బులు ఏమయ్యాయి.
రంగులు వేయడానికి, తీయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టారు, తమ కార్యకర్తలైన వాలంటీర్లకు 4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో సుమారు 3 వేల కోట్లు వరకు దోపిడీ చేశారు.
ఇదే విధంగా పరిపాలన చేస్తే మన రాష్ట్రం ఏమవుతుందో, రాష్ట్రంలో ఉన్న ప్రజలు మేధావుల ఆలోచించవలసిందిగా కోరుచున్నాము.
నీతి అయోగ్ వెబ్సైట్లో కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఈ రాష్ట్రం అభివృద్ధి ఫలితాలు అన్ని గుండు సున్నాలే కనిపిస్తున్నాయి.
చంద్రబాబునాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి రేటు నెంబర్ వన్ గా ఉండేది , కాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలోఅభివృద్ధి రేటు కేవలం సున్నాలకే పరిమితం అయ్యింది.
గాడిదకి గడి పెట్టి
గేదెను పాలు అడిగితే ఎట్లా
అలాగే అవినీతి పరుడికి ఓటు వేసి
రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఎట్లా
ఓటేసిన రాష్ట్ర ప్రజలారా ప్రజలారా మీరే ఆలోచించండి….