మళ్లీ కుండ పోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వర్షాలతో నగరమంతా జలమయమైంది. వర్షానికి తోడు గంటకు 107 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి.
భారీ వర్షాల కారణంగా రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో ముంబై ప్రజలు బయటికి రావొద్దంటూ మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే, పోలీసు అధికారులు సూచించారు. వేగంగా వీచిన గాలులతో అనేక చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు చెట్లు ఇళ్లు, వాహనాలపై కూలాయి.
భారీ వర్షాల కారణంగా ముంబై, రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ముంబైలో పరిస్థితిని సీఎం ఉద్ధవ్ థాక్రే అధికారులు, ఇతర మంత్రులతో సమీక్షించారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, బయటికి రావొద్దని పోలీసులు సూచించారు.