పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కొండ వాగులు పొంగిపొర్లాయి Vizagvision
పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కొండ వాగులు పొంగిపొర్లాయి అలివేరు ,ఎర్ర కాలువ, బై నేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ లో పలు గ్రామాలైన బెడద నూరు ,పాలకుంట, వీరన్నపాలెం , రెడ్డి గణపవరం, రేగులకుంట ఇలా సుమారు 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వీరన్నపాలెం పట్టిన పాలెం గ్రామాల వద్ద నిర్మించిన కల్వర్టులు కొండవాగులా ప్రవాహానికి కొట్టుకుపోయాయి. సుమారు 14 గిరిజన గ్రామాలకు రాకపోకలు లేక రవాణా స్తంభించిపోయింది. పట్టణ పాలెం వద్ద నిర్మిస్తున్న వంతెన పూర్తయ్యేవరకు ఈ కష్టాలు తప్పవని ఆ గిరిజన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వంతెన నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
















